మహేశ్‌భట్‌ నన్ను వేధించాడు.. పోలీసులకు ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు: సినీ నటి లువైనా

24-10-2020 Sat 12:17
  • మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను పెళ్లి చేసుకున్న నటి 
  • ఇటీవల విడాకులకు నటి లువైనా లోధ్ దరఖాస్తు
  • తన కుటుంబానికి ఏమైనా జరిగితే వారే బాధ్యులని వీడియో
acctress allegations on mahesh butt

బాలీవుడ్ ఫిలిం మేకర్ మహేశ్‌భట్‌ బంధువు సుమిత్‌ సబర్వాల్‌ను పెళ్లి చేసుకున్న నటి లువైనా లోధ్ ఇటీవల విడాకుల కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయించింది. తాజాగా ఆమె మహేశ్‌భట్‌పై సంచలన ఆరోపణలు చేసింది. ఆయన తనను వేధించాడని, ఆయన నుంచి తనకు ప్రమాదముందని చెబుతూ తన ఇన్ స్ట్రాగ్రామ్ ఖాతాలో 2 నిమిషాల నిడివి గల ఓ వీడియో పోస్ట్ చేసింది.

సుమిత్‌ సబర్వాల్‌ను తాను వివాహం చేసుకున్నానని, అయితే, ఆయన హీరోయిన్లకు మాదకద్రవ్యాలు సరఫరా చేస్తాడనే విషయం తెలియడంతో విడాకులు తీసుకోవాలనుకుంటున్నానని వివరించింది. ఈ విషయాలన్నీ మహేశ్‌ భట్‌కి తెలుసని, ఆయన సినీ ఇండస్ట్రీకి పెద్ద డాన్ అని, అందులో ప్రతిదీ ఆయన చేతుల్లోనే ఉంటుందని తెలిపింది. ఒకవేళ మహేశ్ భట్ చెప్పినట్లు వినకపోతే, వారి జీవితాలను కష్టాల్లోకి నెట్టేస్తాడని చెప్పింది.

ఇప్పటికే చాలా మంది  జీవితాలను నాశనం చేశాడని, ఆయన ఒక్క ఫోన్‌ కాల్‌ చేస్తే ఉద్యోగాలు కోల్పోతారని చెప్పింది. తమ ఇంటి నుంచి తనను  వెళ్లగొట్టాలని చూశాడని తెలిపింది. దీంతో తాను ఆయనపై గతంలో వేధింపుల కేసు నమోదు చేశానని, పోలీసులు మాత్రం పట్టించుకోలేదని తెలిపింది. తన కుటుంబ భద్రత కోసం తాను ఈ వీడియో పోస్ట్‌ చేస్తున్నానని ఆవేదన వ్యక్తం చేసింది. తనకు, తన కుటుంబానికి ఏదైనా జరిగితే దానికి మహేశ్‌భట్‌, ముఖేశ్ భట్‌, సుమిత్‌ సబర్వాల్‌, సాహెల్‌ సెహగల్‌, కుంకుమ్‌ సెహగల్‌ లే కారకులని లువైనా పేర్కొంది.

 

">