amarnath: ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తే స్వాధీనం చేసుకోరా?: గీతం వర్సిటీ కూల్చివేతలపై వైసీపీ ఎమ్మెల్యే అమర్నాథ్

  • ఖరీదైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారు 
  • దీంతో మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు
  • రూ.800 కోట్ల విలువ గల భూమి స్వాధీనం  
amarnath slams tdp

గీతం సంస్థ కట్టడాల కూల్చివేతలపై టీడీపీ నేతలు చేస్తోన్న విమర్శలకు విశాఖ జిల్లా అనకాపల్లి ఎమ్మెల్యే గుడివాడ అమర్నాథ్ కౌంటర్ ఇచ్చారు. ఈ రోజు విశాఖలో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ... విశాఖలో అత్యంత ఖరీదైన ప్రభుత్వ భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని, దీంతో తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన మండిపడ్డారు. టీడీపీ నేత నారా లోకేశ్ తోడల్లుడు భరత్ దాదాపు 40 ఎకరాల భూమిని తన ఆక్రమణలో పెట్టుకున్నారని ఆయన ఆరోపించారు.

ఈ నేపథ్యంలో రూ.800 కోట్ల విలువ గల భూమిని అధికారులు స్వాధీనం చేసుకున్నారని అమర్నాథ్ వివరించారు. ప్రభుత్వ భూమి ప్రైవేటు వ్యక్తుల ఆక్రమణలో ఉంటే దాన్ని ప్రభుత్వం తిరిగి స్వాధీనం చేసుకోవడానికి ఎవ్వరికీ చెప్పాల్సిన అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. టీడీపీ హయాంలో అత్యంత అవినీతికి పాల్పడిన వ్యక్తిని టీడీపీ తమ పార్టీ ఏపీ అధ్యక్షుడుని చేసిందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ భూములను ఆక్రమించిన వారిని ఎవ్వరినీ విడిచిపెట్టేది లేదని ఆయన చెప్పారు.

More Telugu News