జగపతి బాబుకి కీర్తి సురేశ్ సవాల్.. ‘మిస్ ఇండియా’ ట్రైలర్ విడుదల

24-10-2020 Sat 11:44
  • ఎంబీఏ చదివి బిజినెస్ లో ఎదగాలనుకున్న కీర్తి
  • ఆమెను అణగదొక్కే పాత్రలో జగపతిబాబు
  • నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో విడుదల
  • సినిమాకు నరేంద్రనాథ్ దర్శకత్వం  
Theatrical Trailer of Keerthy Sureshs Miss India

హీరోయిన్ కీర్తి సురేశ్ కొత్త సినిమా ‘మిస్ ఇండియా’ ట్రైలర్ ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఎంబీఏ చదివి బిజినెస్ రంగంలోకి దిగి ఎదగాలనుకున్న ఓ అమ్మాయిని వారి ఇంట్లోని వాళ్లు ఉద్యోగం చేయాలని ఒత్తిడి చేయడం, అయినప్పటికీ మధ్య తరగతి అమ్మాయి బిజినెస్ రంగంలోకి ప్రవేశించడం వంటి సన్నివేశాలను ఇందులో చూపించారు.

ఆమెను విలన్ (జగపతిబాబు) అణగదొక్కాలని అనుకోవడం.. ఆయనకు కీర్తి సురేశ్ సవాలు చేయడం వంటివి ఇందులో చూడొచ్చు.  ‘వ్యాపారం అంటే ఆడపిల్లలు ఆడుకునే ఆటలు కాదు.. అదొక యుద్దం’ అని జగపతి బాబు ఓ డైలాగ్ చెబుతాడు. తాను బిజినెస్ చేయడానికి పుట్టానని, దాని కోసం ఏదైనా చేస్తానని కీర్తి సురేశ్ కౌంటర్ ఇస్తుంది.

నవంబర్ 4న నెట్ ఫ్లిక్స్ లో ఈ సినిమా విడుదల కానుంది. ఈస్ట్ కోస్ట్ ప్రొడక్షన్స్ పతాకంపై మహేశ్ కోనేరు ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాకు నరేంద్రనాథ్ దర్శకత్వం వహించగా, థమన్ సంగీతం అందించాడు.