Rajinikanth: ఎన్నికల ముంగిట రజనీ పార్టీలో మళ్లీ కదలిక.. ముమ్మరంగా సభ్యత్వ నమోదు

tamil super star rajinikanth getting ready for elections
  • వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు
  • సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే పార్టీ ప్రకటన 
  • సభ్యులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలంటూ సూచన  
తమిళనాడు ఎన్నికలకు సిద్ధమవుతున్నవేళ ప్రముఖ సినీ నటుడు రజనీకాంత్ ‘మక్కల్ మండ్రం’లో సందడి మొదలైంది. త్వరలోనే పార్టీని ప్రకటించనున్న నేపథ్యంలో తన ఆర్గనైజేషన్ మక్కల్ మండ్రంలో కొత్త సభ్యులను ముమ్మరంగా చేర్పించాలని ఆయా జిల్లాల శాఖ నాయకులను రజనీకాంత్ ఆదేశించారు. అధినేత ఆదేశాలతో నేతలు సభ్యత్వ ఫారాలు పట్టుకుని కొత్త సభ్యులను చేర్పించే పనిలో బిజీగా మారారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంఘంలో రెండు నెలల క్రితమే బూత్ కమిటీ సభ్యుల ఏర్పాట్లు పూర్తయ్యాయి.

 తమిళనాడులో ప్రధాన ప్రతిపక్షమైన డీఎంకే ఆన్‌లైన్‌లో సభ్యత్వాన్ని ప్రారంభించగా, ఆ దశగా ప్రయత్నించాలని ఆయా శాఖల నాయకులను రజనీ కోరారు. అలాగే సభ్యులుగా చేరిన వారికి వెంటనే ఫొటో గుర్తింపు కార్డు ఇవ్వాలని సూచించారు. సభ్యత్వ కార్యక్రమం పూర్తయిన వెంటనే రజనీ తన పార్టీని ప్రారంభిస్తారని చెబుతున్నారు.
Rajinikanth
Tamil Nadu
Elections
Makkal Mandram

More Telugu News