దుబ్బాక ఉప ఎన్నిక ప్రచారంలో బాబూమోహన్.. రఘునందన్‌రావును గెలిపించాలని పిలుపు

24-10-2020 Sat 08:48
  • టీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందుతాయి
  • రఘునందన్‌రావుకు ప్రజా సమస్యలపై అవగాహన ఉంది
  • ఆయన గెలిస్తేనే దుబ్బాక ప్రజలకు న్యాయం
BJP Leader Babu Mohan campaign in Dubbaka
దుబ్బాక ఉప ఎన్నిక బరిలో నిలిచిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావును గెలిపించాలని ఆ పార్టీ నేత, మాజీ మంత్రి బాబూమోహన్ ప్రజలను కోరారు. నిన్న దుబ్బాక నియోజకవర్గంలో ఆయన ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా బాబూమోహన్ మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీని గెలిపిస్తేనే ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. ప్రజా సమస్యలపై రఘునందన్‌రావుకు పూర్తి అవగాహన ఉందన్నారు. టీఆర్ఎస్ పాలనలో సిద్దిపేట, గజ్వేల్ మాత్రమే అభివృద్ధి చెందుతాయని, దుబ్బాక కూడా అభివృద్ధి సాధించాలంటే రఘునందన్‌రావును గెలిపించాలని బాబూమోహన్ కోరారు.