సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

24-10-2020 Sat 07:35
  • దర్శకత్వం చేస్తానంటున్న ముద్దుగుమ్మ 
  • షూటింగుకి రెడీ అవుతున్న 'ఫైటర్'
  • రేపు శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం  
Akshara Hassan wants to direct a film

*  కమలహాసన్ రెండో కూతురు, శ్రుతిహాసన్ చెల్లెలు అక్షర హాసన్ దర్శకత్వం వైపు దృష్టి సారిస్తోంది. దీని గురించి ఈ చిన్నది చెబుతూ, 'ఒక చిత్రానికి దర్శకత్వం వహించాలని వుంది. అయితే, ఇప్పుడే కాదు లెండి. సరైన సమయం చూసుకుని రంగంలోకి దిగుతాను' అని చెప్పింది. అన్నట్టు అక్షర కూడా అక్కలానే కొన్ని సినిమాలలో నటించింది.  
*  విజయ్ దేవరకొండ హీరోగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో 'ఫైటర్' పేరుతో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. దసరా తర్వాత ఈ చిత్రం తదుపరి షూటింగును బ్యాంకాక్ లో నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నారు. ఇదిలావుంచితే, గత కొన్నాళ్లుగా యూరప్ లో హాలిడే ఎంజాయ్ చేసిన హీరో విజయ్ దేవరకొండ ఇటీవలే హైదరాబాదు చేరుకున్నాడు.
*  శర్వానంద్ హీరోగా కిషోర్ తిరుమల దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనుంది. ఈ చిత్రం షూటింగును రేపు విజయదశమి రోజున తిరుపతి పట్టణంలో ప్రారంభించనున్నారు. దీనికి 'ఆడాళ్లూ మీకు జోహార్లు' అనే పేరును పరిశీలిస్తున్నారు.