ఆసుపత్రిగా మారనున్న వరంగల్ సెంట్రల్ జైల్!

24-10-2020 Sat 07:23
  • మరో ప్రాంతానికి సెంట్రల్ జైలు
  • త్వరలోనే మాస్టర్ ప్లాన్
  • వెల్లడించిన మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు
Warangal Central Jail area developed as Hospital

ప్రస్తుతం వరంగల్ సెంట్రల్ జైలు ఉన్న ప్రాంతంలో ఎంజీఎం ఆసుపత్రిని మరింతగా అభివృద్ధి చేస్తామని, జైలును మరో ప్రాంతానికి తరలిస్తామని తెలంగాణ రాష్ట్ర మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు తెలియజేశారు. ఇందుకోసం ఓ మాస్టర్ ప్లాన్ ను విడుదల చేయనున్నామని, వరంగల్ సమగ్ర అభివృద్ధికి ఇది దోహదం చేస్తుందని ఆయన స్పష్టం చేశారు. వరంగల్ మహానగర పాలక మండలి కౌన్సిల్ సమావేశంలో పాల్గొన్న ఆయన, ఎప్పుడో మాస్టర్ ప్లాన్ అమలు కావాల్సి వుందని వ్యాఖ్యానించారు. సెంట్రల్ జైలును ఇంకో ప్రాంతానికి తరలిస్తామని, ఇదే ప్రాంతంలో అత్యాధునిక సౌకర్యాలతో ఆసుపత్రిని నిర్మిస్తామని స్పష్టం చేశారు.