8 లక్షలు దాటిన ఏపీ కరోనా పాజిటివ్ కేసులు... యాక్టివ్ కేసులు 30 వేల పైచిలుకు మాత్రమే!

23-10-2020 Fri 18:30
  • గడచిన 24 గంటల్లో 3,765 కేసులు
  • 20 మంది మృతి
  • తాజాగా 4,281 మందికి కరోనా నయం
AP Corona Positive cases total crossed eight lakhs mark

ఏపీలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 8 లక్షలు దాటింది. గడచిన 24 గంటల్లో 3,765 కొత్త కేసులు రాగా, మొత్తం కేసుల సంఖ్య 8,00,684కి చేరింది. అయితే, ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 31,721 మాత్రమే. కాగా, మరో 4,281 మందికి కరోనా నయం అయింది.  ఇప్పటివరకు 7,62,419 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో కరోనా పరిస్థితులు వేగంగా కుదుటపడుతుండడం శుభపరిణామం. గత కొన్నిరోజులుగా కొత్తగా వెల్లడవుతున్న కేసుల సంఖ్య, ఒక్కరోజు మరణాల సంఖ్య తగ్గుముఖం పడుతూ వస్తోంది. తాజాగా, ఏపీలో 20 మంది కరోనాతో మరణించారు. తాజా మరణాలతో కలుపుకుని మొత్తం మరణాల సంఖ్య 6,544కి పెరిగింది.