వరద బాధితుల పరామర్శకు వెళ్లిన సబితా ఇంద్రారెడ్డిని అడ్డుకున్న స్థానికులు

23-10-2020 Fri 18:06
  • వరద బాధితులకు సాయం అందించేందుకు వెళ్లిన సబిత
  • టీఆర్ఎస్ కార్యకర్తలకే సాయం అందిస్తున్నారంటూ అడ్డుకున్న స్థానికులు
  • చెక్కులు ఇవ్వకుండానే వెనుదిరిగిన సబిత
Sabitha Indra Reddy faces heat from flood victims

తెలంగాణ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. వివరాల్లోకి వెళ్తే, ఇటీవల కురిసిన భారీ వర్షాలకు హైదరాబాదులోని పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆర్కేపురం ఎన్టీఆర్ నగర్ లో వరద బాధితులను పరామర్శించి, ఆర్థిక సాయాన్ని చెక్కుల రూపంలో అందించేందుకు ఆమె వెళ్లారు. ఈ సందర్భంగా స్థానికులు ఆమెను నిలదీశారు. టీఆర్ఎస్ కార్యకర్తలకు మాత్రమే నష్టపరిహారాన్ని ఇస్తున్నారని, ఇతరులను పట్టించుకోవడం లేదని వాగ్వాదానికి దిగారు. ఈ క్రమంలో చెక్కులను అందించకుండానే ఆమె వెనుదిరిగారు. ఈ మధ్యనే ఆమె కాన్వాయ్ ని కూడా కొందరు అడ్డుకున్న విషయం గమనార్హం.