టీఆర్ఎస్ ఎంపీ రాములుకి కరోనా పాజిటివ్

23-10-2020 Fri 17:07
  • కరోనా బారిన పడుతున్న పలువురు ప్రజాప్రతినిధులు
  • తనకు కరోనా సోకినట్టు ప్రకటించిన పి.రాములు
  • హైదరాబాదులోని ఆసుపత్రిలో చేరిక
TRS MP Ramulu tests with Corona positive

దేశ వ్యాప్తంగా కరోనా కేసులు పెద్ద సంఖ్యలోనే నమోదవుతున్నాయి. సామాన్యులతో పాటు ప్రముఖులు సైతం మహమ్మారి బారిన పడుతున్నారు. తెలంగాణ విషయానికి వస్తే ఇప్పటికే అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కరోనా బారిన పడ్డారు. డిప్యూటీ సీఎం, డిప్యూటీ స్పీకర్, హైదరాబాద్ మేయర్, ఎమ్మెల్యేలు, ఎంపీలు వీరిలో ఉన్నారు. మంత్రి హరీశ్ రావు కూడా కరోనా బారిన పడి కోలుకున్నారు.

 తాజాగా టీఆర్ఎస్ ఎంపీ పి.రాములు కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని స్వయంగా ఆయనే వెల్లడించారు. కరోనా నిర్ధారణ కావడంతో హైదరాబాదులోని ఓ ఆసుపత్రిలో ఆయన చేరారు. తనతో కాంటాక్ట్ లోకి వచ్చిన వారంతా కోవిడ్ టెస్టులు చేయించుకోవాలని ఆయన కోరారు.