Megha Engineering: వరద సహాయచర్యల కోసం మేఘా ఇంజినీరింగ్ సంస్థ రూ.10 కోట్ల భారీ విరాళం

Megha Engineering donates huge amount to Telangana cm relief fund
  • తెలంగాణలో వరద బీభత్సం
  • నష్టం రూ.5 వేల కోట్ల వరకు ఉండొచ్చని అంచనా
  • సీఎం కేసీఆర్ కు చెక్ చెందించిన మేఘా కృష్ణారెడ్డి
ఇటీవల తెలంగాణ రాష్ట్రాన్ని భారీ వర్షాలు, వరదలు ముంచెత్తాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో వరద బీభత్సం అంతాఇంతా కాదు. మొత్తమ్మీద వరద నష్టం రూ.5 వేల కోట్ల వరకు ఉండొచ్చని సీఎం కేసీఆర్ అంచనా వేశారు. ఈ క్రమంలో తెలంగాణ సీఎం సహాయనిధికి భారీగా విరాళాలు వస్తున్నాయి. తాజాగా మేఘా ఇంజినీరింగ్ సంస్థ వరద సహాయ చర్యల కోసం భారీ విరాళం ప్రకటించింది. మేఘా సంస్థ ఎండీ కృష్ణారెడ్డి రూ.10 కోట్ల చెక్ ను సీఎం కేసీఆర్ కు అందించారు.

మేఘా సంస్థ ఇటీవల కరోనా నియంత్రణ చర్యల కోసం కూడా తెలుగు రాష్ట్రాలకు భారీ విరాళం అందించింది. కాగా, వరదల నేపథ్యంలో తెలంగాణ సీఎం సహాయనిధికి ఇప్పటికే హెటెరో, మైహోం, ఈనాడు గ్రూప్ వంటి సంస్థలే కాకుండా టాలీవుడ్ ప్రముఖులు సైతం భారీగా విరాళాలు ఇచ్చిన సంగతి తెలిసిందే.
Megha Engineering
Krishna Reddy
Donation
KCR
Floods
Telangana

More Telugu News