టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోందనే వార్తలపై నిధి స్పందన

23-10-2020 Fri 14:20
  • తాను ఎవరితోనూ డేటింగ్ చేయడం లేదన్న నిధి
  • సింగిల్ గానే ఉన్నానని వ్యాఖ్య
  • ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తున్న నిధి
Nidhi responds on her dating news

హీరోయిన్ నిధి అగర్వాల్ టాలీవుడ్ లో మూడు సినిమాలే చేసినప్పటికీ మంచి గుర్తింపును తెచ్చుకుంది. 'సవ్యసాచి' చిత్రంతో అక్కినేని నాగచైతన్యకు జంటగా తొలిసారిగా తెలుగు సినిమాలో ఆమె నటించింది. తన రెండో చిత్రం 'మిస్టర్ మజ్ను'లో అక్కినేని అఖిల్ సరసన నటించింది. మూడో చిత్రం 'ఇస్మార్ట్ శంకర్'తో టాలీవుడ్ లో తొలి విజయాన్ని అందుకుంది. తెలుగుతో పాటు హిందీ, తమిళ చిత్రాల్లో సైతం నిధి నటించింది.

ప్రస్తుతం నిధికి సంబంధించిన ఓ వార్త ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. ఓ టాలీవుడ్ హీరోతో ఆమె డేటింగ్ చేస్తోందనేదే ఆ వార్త. ఇటీవల ఓ కార్యక్రమానికి హాజరైన సందర్భంగా నిధి ఈ అంశంపై స్పందించింది. తాను ఎవరితోను డేటింగ్ లో లేనని, సింగిల్ గానే ఉన్నానని చెప్పింది. మరోవైపు నిధి ప్రస్తుతం తెలుగులో ఒక సినిమా, తమిళంలో మరో సినిమా చేస్తోంది. హీరో మహేశ్ బాబు మేనల్లుడు గల్లా అశోక్ సరసన నటిస్తోంది.