Varla Ramaiah: ముఖ్యమంత్రి గారూ, ఈ కౌంటర్ ఉద్యమాలు ఏంటి? మీరు ప్రభుత్వంలో ఉన్నారా, ప్రతిపక్షంలో ఉన్నారా?: వర్ల

Varla Ramaiah responds to Bahujana Parirakshana Samithi rally at Amaravati
  • అమరావతిలో బహుజన పరిరక్షణ సమితి ర్యాలీ
  • కౌంటర్ ఉద్యమం అన్యాయం అంటూ వర్ల ట్వీట్  
  • ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయవద్దంటూ హితవు
రాష్ట్రంలో వికేంద్రీకరణ జరగాలని కోరుతూ, మూడు రాజధానుల నిర్ణయానికి మద్దతుగా అమరావతిలో బహుజన పరిరక్షణ సమితి నేతలు ప్రదర్శన నిర్వహించడంపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందించారు. 'ముఖ్యమంత్రి గారూ, ఈ కౌంటర్ ఉద్యమాలు ఏంటి?' అని ప్రశ్నించారు. నిరసనలు తెలియజేయడం, ఉద్యమాలు చేయడం ప్రతిపక్షాల హక్కు, ఆనవాయితీ అని స్పష్టం చేశారు. కానీ విచిత్రంగా మీ హయాంలో ప్రభుత్వమే కౌంటర్ ఉద్యమాలు చేయిస్తోంది అని వర్ల ఆరోపించారు.

ముఖ్యమంత్రి గారూ, మీరు ప్రభుత్వంలో ఉన్నారా? లేక ప్రతిపక్షంలో ఉన్నారా? అని ప్రశ్నించారు. "మీరు చేపట్టిన అమరావతి కౌంటర్ ఉద్యమం అన్యాయం... ఆ ఉద్యమాన్ని ఆపండి, ప్రజాస్వామ్యాన్ని ఎగతాళి చేయకండి" అని హితవు పలికారు.
Varla Ramaiah
Jagan
Amaravati
Bahujana Parirakshana Samithi
Andhra Pradesh

More Telugu News