నీ స్థాయిని చూసి గర్వపడటం కన్నా నాకు మరేదీ సంతోషాన్ని ఇవ్వలేదు: కృష్ణంరాజు

23-10-2020 Fri 13:02
  • ప్రభాస్ కు బర్త్ డే గ్రీటింగ్స్ చెప్పిన పెదనాన్న కృష్ణంరాజు
  • నీవు ఎదిగిన తీరును చూసి గర్విస్తున్నానని వ్యాఖ్య
  • మరెన్నో రికార్డులను బద్దలు కొట్టాలని ఆకాంక్ష
Krishnam Raju greets Prabhas on his birthday

ప్యాన్ ఇండియా స్టార్ గా ఎదిగిన హీరో ప్రభాస్ ఈరోజు తన పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా ఆయనకు వివిధ భాషలకు చెందిన సినీ ప్రముఖుల నుంచి జన్మదిన శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. పెదనాన్న కృష్ణంరాజు కూడా బర్త్ డే గ్రీటింగ్స్ చెపుతూ ప్రభాస్ పై తనకున్న ప్రేమాభిమానాలను వ్యక్తపరిచారు.

'నా అతి పెద్ద శక్తికి, బలానికి పుట్టినరోజు శుభాకాంక్షలు. వృత్తి పట్ల నీకున్న నిబద్ధతే నీకు అనితర సాధ్యమైన విజయాలను తీసుకొచ్చింది. నీవు ఒక అద్భుతమైన వ్యక్తిగా ఎదిగిన తీరును చూసి ఎంతో గర్విస్తున్నా. ఈ రోజు నీవున్న స్థాయిని చూసి గర్వపడటం కన్నా నాకు మరేదీ సంతోషాన్ని ఇవ్వలేదు. సరిహద్దులను దాటి, నీవు మరెన్నో రికార్డులను బద్దలుకొట్టాలి. నా ఆశీర్వాదాలు నీకు ఎప్పుడూ ఉంటాయి' అని కృష్ణంరాజు ట్వీట్ చేశారు.