ప్రభాస్ బర్త్ డే స్పెషల్.. ‘బీట్స్‌ ఆఫ్ రాధేశ్యామ్’‌ విడుదల..ప్రేమలో మునిగి తేలుతోన్న ప్రభాస్, పూజ హెగ్డే

23-10-2020 Fri 12:26
  • రైలులో ప్రేరణ (పూజ హెగ్డే)తో విక్రమాదిత్య (ప్రభాస్)
  • చల్లటి గాలిని ఆస్వాదిస్తూ ప్రేమికుల పోజు 
  • రాధాకృష్ణులకు సంబంధించిన శ్లోకంతో మ్యూజిక్  
BeatsOfRadheShyam out now Prabhas

‘సాహో’ సినిమా తర్వాత యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ నటిస్తోన్న ‘రాధే శ్యామ్‌’ సినిమా నుంచి ఆ సినిమా యూనిట్ బీట్స్‌ఆఫ్‌ రాధేశ్యామ్, మోషన్ పోస్టర్ల‌ను విడుదల చేసింది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ప్రభాస్ జన్మదినం సందర్భంగా దీన్ని విడుదల చేశారు.  

రైలులో  ప్రేరణ (పూజ హెగ్డే)తో విక్రమాదిత్య (ప్రభాస్) ప్రేమలో మునిగితేలుతున్నట్లు ఇది ఉంది. రైలు వెళుతున్న సమయంలో తలుపులోంచి వారిద్దరు బయటకు ముఖాలను పెట్టి చల్లటి గాలిని ఆస్వాదిస్తున్నారు. రాధాకృష్ణులకు సంబంధించిన శ్లోకాన్ని ఈ సందర్భంగా బ్యాక్ గ్రౌండ్ లో వస్తుంది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని, పూజ హెగ్డే  ప్రేరణ పాత్రలో నటిస్తోందని ఈ సినిమా యూనిట్ తెలుపుతూ ఇప్పటికే వారికి సంబంధించిన పోస్టర్లను విడుదల చేసింది.

'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా  పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ ఈ సినిమాకు స్వరాలు అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది జనవరి 1న కానీ, సంక్రాంతి సందర్భంగా జనవరి 14న కానీ విడుదల చేయనున్నారు.