ఈ లాజిక్ ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు: విజయసాయిరెడ్డి

23-10-2020 Fri 10:34
  • విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలి
  • సీఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట
  • ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నాడట
  • గ్రాఫిక్స్ హోరు తప్ప  చంద్రబాబు చేసిందేమీ లేదు
vijaya sai slams chandrababu

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడిపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి తీవ్ర విమర్శలు గుప్పించారు. తెలుగు దేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో గ్రాఫిక్స్ చూపడం తప్ప ప్రజల కోసం ఏమీ చేయలేదని చెప్పారు.

‘విమర్శలు నమ్మశక్యంగా, వాస్తవాలకు దగ్గరగా ఉండాలనే లాజిక్ ను చంద్రబాబు గారు ఎప్పుడో గాలికొదిలారు. సీఎంగా జగన్ గారు చేసింది శూన్యమంట. ఈయన పథకాలనే పేరుమార్చి అమలు చేస్తున్నాడట. గ్రాఫిక్స్ హోరు తప్ప తమరు పెట్టిన నాలుగు వెల్ఫేర్ స్కీముల పేర్లు చెప్పండి బాబూ?’ అని ఎద్దేవా చేశారు.
 
‘ఆధునిక ఆంధ్రప్రదేశ్ చరిత్ర ఏం చెబుతోంది? చంద్రబాబుది- తన కోసం, తన వారి కోసం ఆరాటం. జగన్ గారిది- వందల కులాలు, మూడు ప్రాంతాల అభివృద్ధి కోసం నిరంతర పోరాటం’ అని విజయసాయిరెడ్డి చెప్పుకొచ్చారు.