దేశంలో 10 కోట్లు దాటిన కరోనా పరీక్షల సంఖ్య!

23-10-2020 Fri 10:06
  • గత 24 గంటల్లో 54,366 మందికి కరోనా నిర్ధారణ
  • కోలుకున్న 73,979 మంది
  • మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,61,312
  • మృతుల సంఖ్య 1,17,306
54366 Fresh Coronavirus Cases In India Total Cases At 7761 Lakh

దేశంలో కరోనా కేసుల సంఖ్యపై కేంద్ర వైద్య, ఆరోగ్య మంత్రిత్వ శాఖ బులిటెన్ విడుదల చేసింది. గత 24 గంటల్లో 54,366 మందికి కరోనా నిర్ధారణ అయిందని  పేర్కొంది. అదే సమయంలో 73,979 మంది కోలుకున్నారు. దీంతో దేశంలో నమోదైన మొత్తం కరోనా కేసుల సంఖ్య 77,61,312 కి చేరింది.

గ‌త 24 గంట‌ల సమయంలో 690 మంది కరోనా కారణంగా మృతి చెందారు. దీంతో మృతుల సంఖ్య 1,17,306 కి పెరిగింది. దేశంలో కరోనా నుంచి ఇప్పటివరకు 69,48,497 మంది కోలుకున్నారు. 6,95,509 మందికి ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌లలో చికిత్స అందుతోంది.  
 
   
కాగా, దేశంలో కరోనా పరీక్షల సంఖ్య పది కోట్లు దాటడం గమనార్హం. నిన్నటి వరకు మొత్తం 10,01,13,085 కరోనా పరీక్షలు నిర్వహించినట్లు భారతీయ వైద్య పరిశోధన మండలి (ఐసీఎంఆర్) తెలిపింది. నిన్న ఒక్కరోజులోనే 14,42,722 శాంపిళ్లను పరీక్షించినట్లు పేర్కొంది.