India: ఇండియాకు తిరిగి వస్తున్న పబ్ జీ!

  • మొత్తం 117 యాప్ లపై కేంద్రం నిషేధం
  • కొత్త ఉద్యోగాలను ప్రకటిస్తూ, పబ్ జీ నోటిఫికేషన్
  • డౌన్ లోడ్లు లేకున్నా, నడుస్తున్న గేమ్
Pub Z Returns to India in A Short Time

ఇటీవల నిషేధానికి గురైన పబ్ జీ, తిరిగి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. అందుబాటులోని సమాచారం ప్రకారం, పబ్ జీ కార్పొరేషన్ యాజమాన్య సంస్థ అయిన దక్షిణ కొరియాకు చెందిన క్రాఫన్, ఇండియాలో నియామకాలను ప్రారంభించింది. ఈ మేరకు 20వ తేదీన లింక్డ్ ఇన్ లో ఉద్యోగ నియామకాలను ప్రకటిస్తూ, పోస్ట్ పెట్టింది. కార్పొరేట్ డెవలప్ మెంట్ డివిజన్ మేనేజర్ స్థాయి పోస్టులు కూడా ఇందులో ఉండటంతో, గేమింగ్ యాప్ తిరిగి ఇండియాలో మొదలవుతుందన్న వార్తలకు బలం చేకూరింది.

అయితే, ఈ యాడ్ టెన్సెంట్ పేరిట కాకుండా, క్రాఫన్ పేరిట కనిపించడం గమనార్హం. ఇక, తమ సంస్థలో చురుకుగా నియామకాలను చేపడుతున్నామని వెల్లడించడం గమనార్హం. కాగా, ప్రస్తుతం పబ్ జీపై నిషేధం అమలవుతున్నా, కన్సోల్స్ తో పాటు పీసీల్లో ఈ గేమ్ అందుబాటులోనే ఉంది. ఇటీవలే బ్లూ హోల్ స్టూడియో సంస్థ టెన్సెంట్ గేమ్స్ లో 1.5 శాతం వాటాను కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే.

ప్రస్తుతం దాదాపు 117 చైనా యాప్ లపై నిషేధం అమలవుతోంది. ఈ బ్యాన్ కేవలం కొత్త డౌన్ లోడ్లను మాత్రమే నిలువరిస్తుంది. ప్లే స్టోర్, యాపిల్ స్టోర్ తదితరాల నుంచి ముందుగానే డౌన్ లోడ్ చేసుకుని ఇన్ స్టాల్ చేసుకున్న వారు ఇప్పటికీ గేమ్ ను ఆడుకుంటూనే ఉన్నారు. పబ్ జీ తిరిగి ఇండియాలో అందుబాటులోకి రావడంపై అధికారిక ప్రకటన వెలువడాల్సి వుంది.

More Telugu News