Hyderabad: ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ లాకర్‌లో 1250 గ్రాముల బంగారం, 7.2 కిలోల వెండి!

  • లంచం కేసులో దొరికిపోయి జైలులో ఆత్మహత్య చేసుకున్న నాగరాజు
  • ఆయన బినామీల లాకర్లను తెరిచిన అధికారులు
  • బినామీ లాకర్లను నిర్వహిస్తున్న నాగరాజు భార్య స్వప్న
ACB officials open keesara mro icici lockers

రూ. 1.10 కోట్ల లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయి, ఆ తర్వాత చంచల్‌గూడ జైలులో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న కీసర మాజీ తహసీల్దార్ నాగరాజు బినామీలకు చెందిన రెండు లాకర్లను నిన్న ఏసీబీ అధికారులు తెరిచారు. అల్వాల్, మేడ్చల్‌లోని ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో వీటిలో ఉన్న 1250 గ్రాముల బంగారం, 7.2 కిలోల వెండి ఆభరణాలు, రెండు ఆస్తి పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.

తన స్నేహితుడైన నందగోపాల్, ఐసీఐసీఐలో పనిచేసే ఆయన సోదరుడైన మహేందర్‌లను నాగరాజు ఒప్పించి వారితో ఈ లాకర్లను తెరిచినట్టు దర్యాప్తులో తేలింది. ఈ రెండింటిని నాగరాజు భార్య స్వప్న నిర్వహిస్తున్నట్టు అధికారులు గుర్తించారు. లాకర్ల నుంచి స్వాధీనం చేసుకున్న ఆస్తి పత్రాలకు సంబంధించిన ఆస్తులు ఎక్కడ ఉన్నాయి? వాటి మార్కెట్ విలువ ఎంత అనే దానిపై ఏసీబీ అధికారులు వివరాలు సేకరిస్తున్నారు.

More Telugu News