కీలకపోరులో రాజస్థాన్ రాయల్స్ ను కట్టడి చేసిన సన్ రైజర్స్ బౌలర్లు

22-10-2020 Thu 21:24
  • దుబాయ్ లో సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్
  • మొదట బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు
  • 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 రన్స్
  • హోల్డర్ కు 3 వికెట్లు
Sunrisers Hyderabad bowlers restricts Rajasthan batsmen

దుబాయ్ లో రాజస్థాన్ రాయల్స్ తో మ్యాచ్ లో సన్ రైజర్స్ హైదరాబాద్ బౌలర్లు విశేష ప్రతిభ చూపించారు. టాస్ గెలిచిన సన్ రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ రాజస్థాన్ కు బ్యాటింగ్ అప్పగించాడు. తమ కెప్టెన్ నమ్మకాన్ని సన్ రైజర్స్ బౌలర్లు వమ్ము చేయలేదు. సందీప్ శర్మ, హోల్డర్, విజయ్ శంకర్, నటరాజన్, రషీద్ ఖాన్ లతో కూడిన హైదరాబాద్ బౌలింగ్ దళం ప్రత్యర్థి జట్టులో ఏ ఒక్క బ్యాట్స్ మన్ ను కుదురుకోనివ్వలేదు. దాంతో రాజస్థాన్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 154 పరుగులు మాత్రమే చేయగలిగింది.

ఆ జట్టులో టాప్ స్కోరర్ సంజూ శాంసన్. శాంసన్ 26 బంతుల్లో 36 పరుగులు చేసి హోల్డర్ బౌలింగ్ బౌల్డయ్యాడు. ఈ మ్యాచ్ లో మూడు వికెట్లు తీసిన హోల్డర్ ఓ రనౌట్ లోనూ పాలుపంచుకున్నాడు. ఇతర బౌలర్లలో విజయ్ శంకర్ 1, రషీద్ ఖాన్ 1 వికెట్ తీశారు. రాజస్థాన్ ఇన్నింగ్స్ లో స్టోక్స్ 30, రియాన్ పరాగ్ 20, కెప్టెన్ స్మిత్ 19 పరుగులు నమోదు చేశారు.