అమిత్‌షాకు ఫోన్ చేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన చంద్రబాబు

22-10-2020 Thu 20:44
  • ఈరోజు అమిత్ షా పుట్టినరోజు
  • ఆరోగ్యం గురించి కూడా అడిగిన చంద్రబాబు     
  • పియూష్ గోయెల్ కు కూడా ఫోన్ చేసిన టీడీపీ అధినేత
Chandrababu speaks to Amit Shah by phone

కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు టీడీపీ అధినేత చంద్రబాబు ఫోన్ చేశారు. ఈరోజు అమిత్ షా పుట్టిన రోజు. ఈ నేపథ్యంలోనే ఆయనకు చంద్రబాబు ఫోన్ చేశారు. పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ఇటీవలే అమిత్ షా కరోనా నుంచి కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఆరోగ్య పరిస్థితి గురించి కూడా అడిగి తెలుసుకున్నారు.

మరోవైపు మరో కేంద్ర మంత్రి పియూష్ గోయల్ కు కూడా చంద్రబాబు ఫోన్ చేశారు. పియూష్ గోయల్ కు కిడ్నీలో రాళ్లు ఏర్పడిన నేపథ్యంలో ఆయన చికిత్స చేయించుకోనున్నారు. ఈ సందర్భంగా ఆయన త్వరగా కోలుకోవాలని చంద్రబాబు ఆకాంక్షించారు.