అత్యంత అవినీతిపరుడు నితీశ్ కుమార్: తేజస్వి యాదవ్

22-10-2020 Thu 19:19
  • ఖజానా నుంచి రూ. 30 వేల కోట్లు మళ్లాయి
  • ఇందులో నితీశ్ కు వాటా ఉంది
  • మేము అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు చేయిస్తాం
Nitish Kumar is highly corrupted says Tejashvi Yadav

బీహార్ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పార్టీ నేతల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. నువ్వు ఒకటి అంటే నేను రెండు అంటా అనే విధంగా ప్రచారం కొనసాగుతోంది. సీఎం నితీశ్ కుమార్ పై ఆర్జేడీ నేత తేజశ్వి యాదవ్ తీవ్ర ఆరోపణలు చేశారు. నితీశ్ కుమార్ అతిపెద్ద అవినీతిపరుడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ఖజానా నుంచి రూ. 30 వేల కోట్లు అక్రమంగా మళ్లాయని... ఇందులో నితీశ్ కు వాటా ఉందని అన్నారు. అందువల్లే ఈ అవినీతి అంశంపై నితీశ్ మాట్లాడటం లేదని చెప్పారు. ఈ కారణం వల్లే ఆయనను అవినీతిలో భీష్మపితామహుడిగా పిలుస్తామని ఎద్దేవా చేశారు. తమ ప్రభుత్వం వస్తే ఈ అవినీతిపై దర్యాప్తు చేయిస్తామని చెప్పారు.