ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్... టాస్ గెలిచిన వార్నర్

22-10-2020 Thu 19:15
  • దుబాయ్ లో మ్యాచ్
  • బౌలింగ్ ఎంచుకున్న సన్ రైజర్స్
  • కేన్ విలియమ్సన్ కు విశ్రాంతి
  • బాసిల్ థంపీకి ఉద్వాసన
SRH won the toss against Rajasthan Royals in a crucial match

ఐపీఎల్ పోటీలు కీలకదశకు చేరుకున్నాయి. ఇప్పటి నుంచి ఆడే ప్రతి మ్యాచ్ ఆయా జట్ల ప్లే ఆఫ్ అవకాశాలను ప్రభావితం చేయనుండడంతో హోరాహోరీ పోరు తప్పదనిపిస్తోంది. ఐపీఎల్ లో నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియం వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ సారథి డేవిడ్ వార్నర్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు.

ఈ మ్యాచ్ కోసం రాజస్థాన్ రాయల్స్ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలో దిగుతోంది. మరోవైపు సన్ రైజర్స్ రెండు మార్పులు చేసింది. జాసన్ హోల్డర్, షాబాజ్ నదీమ్ జట్టులోకి వచ్చారు. కేన్ విలియమ్సన్, బాసిల్ థంపిలను పక్కనబెట్టారు. రాజస్థాన్ జట్టు ఇప్పటివరకు 10 మ్యాచ్ లు ఆడి 4 విజయాలు సాధించగా, సన్ రైజర్స్ 9 మ్యాచ్ లు ఆడి 3 విజయాలు నమోదు చేసింది.