'ఆర్‌ఆర్‌ఆర్' యూనిట్ కు అభినందనలు: సీతక్క

22-10-2020 Thu 18:55
  • కొమురం భీమ్ పాత్రను పోషిస్తున్న ఎన్టీఆర్
  • టీజర్ ను విడుదల చేసిన చిత్ర యూనిట్
  • మన్యం ముద్దు బిడ్డ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్నారని సీతక్క కితాబు
MLA Seethakka congratulates RRR team

'ఆర్ఆర్ఆర్' చిత్రంపై సినీ అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకున్నారు. సినిమా కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కరోనా కారణంగా కొన్ని నెలల పాటు ఆగిపోయిన సినిమా షూటింగ్... ఇప్పుడు మళ్లీ ప్రారంభమైంది. దర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో అల్లూరి సీతారామరాజు పాత్రను రామ్ చరణ్ పోషిస్తుండగా, కొమురం భీమ్ పాత్రలో ఎన్టీఆర్ నటిస్తున్నాడు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా ఎన్టీఆర్ కు సంబంధించిన టీజర్ ను చిత్ర యూనిట్ విడుదల చేసింది.

దీనిపై తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క స్పందించారు. 'మన్యం ముద్దుబిడ్డ, మా అన్న, మా ఆదర్శం కొమురం భీమ్ జయంతి సందర్భంగా నా ఘన నివాళులు' అని ఆమె ట్వీట్ చేశారు. కొమురం భీమ్ స్ఫూర్తితో తెరకెక్కిస్తున్న ఈ చిత్ర యూనిట్ కి అభినందనలు తెలియజేస్తున్నానని చెప్పారు.