ఏపీలో తగ్గుతున్న కరోనా మరణాల సంఖ్య

22-10-2020 Thu 18:06
  • గత 24 గంటల్లో 16 మంది మృతి
  • 3,620 పాజిటివ్ కేసులు వెల్లడి
  • 3,723 మందికి కరోనా నయం
Mortality rate declines in Andhra Pradesh

ఏపీలో కరోనా వ్యాప్తి పతాక స్థాయికి చేరుకున్న తర్వాత, ఇటీవల ఎన్నడూ లేనంత కనిష్ఠ స్థాయిలో మరణాలు నమోదయ్యాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రంలో 16 కరోనా మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,524కి పెరిగింది.

తాజాగా 76,726 నమూనాలు పరీక్షించగా 3,620 పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. అత్యధికంగా పశ్చిమ గోదావరి జిల్లాలో 631, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 66 కేసులు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రంలో 3,723 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు ఏపీలో మొత్తం 7,96,919 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,58,138 మంది వైరస్ నుంచి విముక్తులయ్యారు. ఇంకా, 32,257 మంది చికిత్స పొందుతున్నారు.