'టక్ జగదీష్' షూటింగ్ ఆగిపోయిందన్న ప్రచారంపై దర్శకుడి వివరణ

22-10-2020 Thu 17:49
  • కరోనా కారణంగా చిత్రీకరణ నిలిచిపోయిందని కథనాలు
  • 'టక్ జగదీష్' ఆగిపోలేదని స్పష్టీకరణ
  • 38వ రోజు షూటింగ్ కొనసాగుతోందని వెల్లడి
Director Siva Nirvana clarify Tuck Jagadish shooting proceedings

నాని, రీతు వర్మ, ఐశ్వర్య రాజేశ్, జగపతిబాబు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం 'టక్ జగదీష్'. అయితే ఈ చిత్రం షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయిందని వార్తలు వస్తున్నాయి. 'టక్ జగదీష్' షూటింగ్ మళ్లీ ఆగిందంటూ మీడియాలో కథనాలు వచ్చాయి. యూనిట్ లో ఓ టెక్నీషియన్ కరోనా బారినపడడంతో ముందు జాగ్రత్తగా చిత్రీకరణ ఆపివేశారన్నది ఆ కథనాల సారాంశం. అంతేకాదు, చిత్ర యూనిట్ మొత్తం హోం ఐసోలేషన్ లోకి వెళ్లిపోయిందని కూడా ప్రచారం జరుగుతోంది.

అయితే, 'టక్ జగదీష్' షూటింగ్ ఆగిపోలేదని, కొనసాగుతోందని ఆ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ ఓ వీడియో విడుదల చేశారు. "టక్ జగదీష్ ను ఆపలేరు... 38వ రోజున సెట్స్ పై ఇలా.." అంటూ శివ ట్వీట్ చేశారు. 'టక్ జగదీష్' సెట్స్ పై శానిటైజర్ యంత్రాలతో ఎలా శుద్ధి చేస్తున్నదీ ఆ వీడియోలో చూడొచ్చు.