నాయిని అంత్యక్రియల్లో జేబుదొంగల చేతివాటం... రాజకీయనేతలే టార్గెట్!

22-10-2020 Thu 17:29
  • ముగిసిన మాజీ మంత్రి అంత్యక్రియలు
  • మహాప్రస్థానంలో అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు
  • భారీగా తరలివచ్చిన టీఆర్ఎస్ శ్రేణులు
Pick pocketers nabbed by police at Nayini Narsimha Reddy last rites

మాజీ హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి అంత్యక్రియలు ముగిశాయి. హైదరాబాదు జూబ్లీహిల్స్ లోని మహాప్రస్థానం శ్మశాన వాటికలో నాయినికి అధికార లాంఛనాలతో అంతిమ సంస్కారాలు నిర్వహించారు. తమ అభిమాన నేతను చివరిసారి చూసేందుకు భారీగా టీఆర్ఎస్ శ్రేణులు తరలి వచ్చాయి. మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు హాజరై తమ పార్టీ సహచరుడికి అంతిమ వీడ్కోలు పలికారు.

అయితే, ఈ సందర్భగా నాయిని అంత్యక్రియల్లో జేబుదొంగలు రెచ్చిపోయారు. రాజకీయనేతలే లక్ష్యంగా చెలరేగిపోయారు. పలువురు తమ జేబులు చూసుకుని లబోదిబోమన్నారు. వెంటనే స్పందించిన పోలీసులు ఓ వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఇంకా మరికొందరు జేబుదొంగలు ఉండొచ్చని, ఓ ముఠా రంగంలోకి దిగి ఉంటుందని పోలీసు అధికారులు భావిస్తున్నారు.