Mahesh Babu: మహేశ్ బాబు సినిమాకి వీసాల సమస్య?

Visa hurdels arise for Mahesh film
  • బ్యాంక్ మోసాల నేపథ్యంలో 'సర్కారు వారి పాట' 
  • మహేశ్ బాబు సరసన కథానాయికగా కీర్తి సురేశ్
  • అమెరికాలో ఎక్కువ భాగం షూటింగుకి ప్లాన్
  • వీసా దరఖాస్తులు ఇంకా ప్రాసెస్ కాని వైనం  

మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. సంక్రాంతికి వచ్చిన 'సరిలేరు నీకెవ్వరు' వంటి హిట్ తరవాత మహేశ్ చేస్తున్న ఈ చిత్రం పట్ల అటు ప్రేక్షకులలోను.. ఇటు ట్రేడ్ వర్గాలలోనూ చాలా అంచనాలు వున్నాయి. పరశురామ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం షూటింగుకి లాక్ డౌన్ కారణంగా బ్రేక్ పడిన సంగతి విదితమే.

ఇక కథ ప్రకారం, అమెరికాలో ఎక్కువ భాగం షూటింగ్ చేయాల్సి ఉండడంతో తొలి షెడ్యూలును నవంబర్ నుంచి యూ ఎస్ లో చేద్దామని ప్లాన్ చేశారు. ఈ క్రమంలో ఇటీవలే దర్శకుడు, కెమెరామెన్, ఆర్ట్ డైరెక్టర్ అమెరికాకు వెళ్లి లొకేషన్స్ ను కూడా ఎంపిక చేసుకుని వచ్చారు. అమెరికాలో నలభై ఐదు రోజుల షూటింగుకు ఏర్పాట్లు చేసుకున్నారు. యూనిట్ సభ్యులందరికీ వర్క్ పర్మిట్ల కోసం దరఖాస్తు కూడా చేశారు. అయితే, ఇప్పుడు వీసాల సమస్య తలెత్తినట్టు తెలుస్తోంది. వీరి వీసాల దరఖాస్తులు ఇంతవరకు ప్రాసెస్ కాలేదని సమాచారం.

దీంతో వీసాలు రావడం మరింత ఆలస్యం అవ్వచ్చనీ, పర్యవసానంగా షూటింగ్ మొదలవ్వడం కూడా లేట్ అవుతుందని తెలుస్తోంది. వీసాలు రావడాన్ని బట్టి యూఎస్ షెడ్యూల్ వేసుకుంటారు. కాగా, ఈ సినిమాలో మహేశ్ సరసన కీర్తి సురేశ్ కథానాయికగా నటించనుంది. ఇటీవల మన దేశంలో జరిగిన బ్యాంక్ మోసాల ఇతివృత్తంతో ఈ చిత్రాన్ని దర్శకుడు పరశురామ్ తెరకెక్కించనున్నాడు.

  • Loading...

More Telugu News