సొంత ఇంటి ఏర్పాట్లలో కాజల్ జంట

22-10-2020 Thu 16:48
  • గౌతమ్ కిచ్లూని పెళ్లాడబోతున్న కాజల్
  • అక్టోబర్ 30న ముంబైలో వివాహం
  • కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయని తెలిపిన కాజల్
Kajal announces her new house work is going on

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కబోతున్న సంగతి తెలిసిందే. ముంబైకి చెందిన బిజినెస్ మేన్ గౌతమ్ కిచ్లూని ఆమె పెళ్లాడబోతోంది. ఇంటీరియర్ బిజినెస్ కు సంబంధించిన కంపెనీని గౌతమ్ నిర్వహిస్తున్నాడు. తొలుత స్నేహితులుగా ఉన్న వీరిద్దరూ ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. ఇప్పుడు ఇరు కుటుంబాల అంగీకారంతో వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. అక్టోబర్ 30న వీరి వివాహం ముంబైలో జరగనుంది. అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహం జరగబోతోంది.

మరోవైపు సొంత ఇంటి ఏర్పాట్లలో ఈ జంట ఉంది. తమ కొత్త ఇంటి పనులు జరుగుతున్నాయని కాజల్ తన సోషల్ మీడియా ఖాతా ద్వారా తెలిపింది. ఏవైనా సలహాలు, సూచనలు ఉంటే ఇవ్వాలని అభిమానులను సరదాగా అడిగింది.