రాష్ట్రానికి బాబు తెచ్చింది ఏందయ్యా అంటే నీరూ, మట్టి!: విజయసాయిరెడ్డి

22-10-2020 Thu 15:48
  • అమరావతిపై చంద్రబాబు ట్వీట్
  • విమర్శలు చేసిన విజయసాయి
  • జనాలు నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి అంటూ వ్యాఖ్యలు
Vijayasai Reddy says Babu brought just water and soil for state

అమరావతికి శంకుస్థాపన జరిగి నేటికి ఐదేళ్లయిందంటూ మాజీ సీఎం చంద్రబాబునాయుడు చేసిన ట్వీట్ పై వైసీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి విజయసాయిరెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. బాబు అభివృద్ధి కంటే గ్రాఫిక్స్ కే ప్రాధాన్యత ఇచ్చారని దుయ్యబట్టారు.  

"బాబు అనుభవం అంతా రాష్ట్రాభివృద్ధిలో కాకుండా గ్రాఫిక్స్ లో చూపెట్టి... రాష్ట్ర ప్రజల్ని మభ్యపెట్టి, రాష్ట్ర ప్రయోజనాలన్ని తొక్కిపెట్టి, సొంత ప్రయోజనాలను ముందు పెట్టి... రాష్ట్రానికి తెచ్చింది ఏంటయ్యా అంటే నీరూ, మట్టి.... అందుకే జనాలు నిన్ను కూర్చోబెట్టారు ఓడగొట్టి" అంటూ విజయసాయి ట్వీట్ చేశారు.