నష్టాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు

22-10-2020 Thu 15:47
  • లాభాల స్వీకరణకు మొగ్గు చూపిన ఇన్వెస్టర్లు
  • 148 పాయింట్లు నష్టపోయిన సెన్సెక్స్
  • 41 పాయింట్లు కోల్పోయిన నిఫ్టీ
Sensex ends in losses after 4 days winning streak

వరుసగా నాలుగు రోజుల పాటు లాభాల్లో కొనసాగిన దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు నష్టాల్లో ముగిశాయి. ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు మొగ్గు చూపడంతో ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి మార్కెట్ లు నష్టాల్లోనే కొనసాగాయి. ఈరోజు  ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 148 పాయింట్లు పతనమై 40,558కి పడిపోయింది. నిఫ్టీ 41 పాయింట్లు నష్టపోయి 11,896 వద్ద స్థిరపడింది. ఫైనాన్స్, హెల్త్ కేర్, ఆటో, టెక్, ఎనర్జీ, బ్యాంకెక్స్, ఐటీ స్టాకులు నష్టాలను చవిచూశాయి.

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
భారతి ఎయిర్ టెల్ (2.91%), బజాజ్ ఫైనాన్స్ (2.19%), యాక్సిస్ బ్యాంక్ (2.03%), టాటా స్టీల్ (1.93%), ఓఎన్జీసీ (1.47%).

టాప్ లూజర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (-3.07%), ఐసీఐసీఐ బ్యాంక్ (-1.70%), టైటాన్ కంపెనీ (-1.37%), ఇన్ఫోసిస్ (-1.31%), హెచ్డీఎఫ్సీ బ్యాంక్ (-1.21%).