తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్ కు రామోజీరావు భారీ విరాళం
- వరద బాధితుల కోసం రూ. 5 కోట్ల విరాళం ఇచ్చిన రామోజీరావు
- రామోజీకి ధన్యవాదాలు తెలిపిన కేటీఆర్
- రూ. 10 లక్షల విరాళం ఇచ్చిన దర్శకుడు ఎన్.శంకర్
ఇదే సమయంలో వరద బాధితుల సహాయార్థం పలువురు సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ప్రభుత్వానికి విరాళాలు ప్రకటిస్తున్నారు. తాజాగా రామోజీ గ్రూప్ సంస్థల అధినేత రామోజీరావు తెలంగాణ సీఎం సహాయనిధికి రూ. 5 కోట్ల విరాళం ప్రకటించారు. రామోజీ గ్రూప్ సంస్థల ప్రతినిధి ఈ చెక్ ను మంత్రి కేటీఆర్ కు అందించారు. ఈ సందర్భంగా రామోజీరావుకు కేటీఆర్ కృతజ్ఞతలు తెలిపారు.
మరోవైపు సినీ దర్శకుడు ఎన్.శంకర్ కూడా వరద బాధితుల సహాయార్థం తన వంతుగా రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. దీనికి సంబంధించిన చెక్ ను స్వయంగా కేటీఆర్ కు ఆయన అందించారు.