కోమటిరెడ్డి వెంకటరెడ్డికి కరోనా పాజిటివ్

22-10-2020 Thu 14:23
  • కోవిడ్ టెస్ట్ చేయించుకోగా పాజిటివ్ గా నిర్ధారణ
  • కనిపించని కరోనా లక్షణాలు
  • సెల్ఫ్ ఐసొలేషన్ కు వెళ్లిపోయిన కోమటిరెడ్డి
Komatireddy Venkat Reddy tests positive with Corona virus

తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నేత, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కరోనా బారిన పడ్డారు. కోవిడ్ టెస్ట్ చేయించుకోగా ఆయనకు కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. అయితే కరోనా లక్షణాలు మాత్రం ఆయనలో కనిపించలేదు. కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడంతో ఆయన సెల్ఫ్ ఐసొలేషన్ లోకి వెళ్లిపోయారు. తనను కలిసిన వారందరూ కరోనా టెస్టులు చేయించుకోవాలని ఈ సందర్భంగా అందరినీ కోమటిరెడ్డి కోరారు. మరోవైపు ప్రజల మధ్యలో తిరుగుతుండే రాజకీయ నాయకులు కరోనా బారిన పడుతున్న ఘటనలు ఎక్కువవుతున్నాయి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వీరు కరోనా బారిన పడుతున్నారు.