కొవిడ్ తో నాన్న పోరాడుతున్నారు.. ఆయన ఆరోగ్యం కోసం ప్రార్థించండి: డా. రాజశేఖర్ కూతురు శివాత్మిక ట్వీట్లు

22-10-2020 Thu 09:40
  • కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది
  • అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు
  • మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడుతాయి
  • అసత్య వార్తలను ప్రచారం చేయకండి
Shivathmika Rajashekar Nannas fight with covid has been difficult

సినీ నటుడు రాజశేఖర్‌తో పాటు ఆయన భార్యాపిల్లలు కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ప్రస్తుతం తాము కరోనాకు ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నామని, ఇద్దరు పిల్లలు ఇప్పటికే కరోనా నుంచి బయటపడ్డారని రాజశేఖర్ ఇటీవల తెలిపారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై ఆయన కూతురు శివాత్మిక రాజశేఖర్ ట్వీట్ చేసింది.

‘కరోనాపై నాన్న చేస్తోన్న పోరాటం క్లిష్టంగా ఉంది.. అయినప్పటికీ ఆయన బాగా పోరాడుతున్నారు. మీ ప్రార్థనలు, ప్రేమే మమ్మల్ని కాపాడుతాయి. నాన్న త్వరగా కోలుకోవాలని ప్రార్థించాలని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఆయన పూర్తిగా కోలుకుని తిరిగి వస్తారు’ అని ఆమె ట్వీట్ చేసింది.

అయితే, కాసేపటి తర్వాత శివాత్మిక మరో ట్వీట్ చేయడం గమనార్హం.  ‘మీ ప్రేమ ప్రార్థనల పట్ల కేవలం కృతజ్ఞతలు చెబితే సరిపోదు. అయితే, ఓ విషయం తెలుసుకోండి.. ఆయన పరిస్థితి విషమంగా లేదు. ఆయన పరిస్థితి నిలకడగానే ఉంది.. కోలుకుంటున్నారు. మీ ప్రార్థనలు కావాలి. మీకు మరోసారి కృతజ్ఞతలు తెలుపుతున్నాను. భయపడకండి.. అసత్యవార్తలను ప్రచారం చేయకండి’ అని ఆమె చెప్పింది.