హైదరాబాద్‌లో మళ్లీ కంపించిన భూమి.. ఈసారి వనస్థలిపురంలో..

22-10-2020 Thu 09:31
  • నగర వాసులను భయపెడుతున్న భూ ప్రకంపనలు
  • ఈ తెల్లవారుజామున పలుమార్లు కంపించిన భూమి
  • భూమిలోంచి శబ్దాలు రావడంతో భయంతో ప్రజల పరుగులు
Earthquake  jolts Hyderabad once again

హైదరాబాద్‌లో వరుస భూప్రకంపనలు జనాలను బెంబేలెత్తిస్తున్నాయి. ఇటీవల జూబ్లీహిల్స్ పరిధిలోని బోరబండ, రహమత్‌నగర్ ప్రాంతాల్లో వరుసగా రెండు రోజులు పలుమార్లు భూమి కంపించగా, ఆ తర్వాత గచ్చిబౌలిలో భూ ప్రకంపనలు భయపెట్టాయి. అంతేకాకుండా, భూమిలోంచి శబ్దాలు కూడా రావడంతో ప్రజలు వణికిపోయారు.

 తాజాగా, వనస్థలిపురం, బీఎన్‌‌రెడ్డి నగర్‌, వైదేహి‌నగర్‌లలో ఈ తెల్లవారుజామున భూ ప్రకంపనలు సంభవించాయి. భూమి లోంచి శబ్దాలు కూడా రావడంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి రోడ్డుపైకి వచ్చారు. 5 గంటల నుంచి ఏడు గంటల మధ్య భూమి పలుమార్లు కంపించినట్టు స్థానికులు తెలిపారు.