ఇబ్బందులెన్నున్నా విజయం ట్రంప్ దే నంటున్న జ్యోతిష్యులు!

22-10-2020 Thu 06:37
  • ట్రంప్ లైఫ్ పాత్ నంబర్ 22
  • భారీ విజయాలు వారి సొంతం
  • బైడెన్ నంబర్ చాలా చాలా బలహీనమైన 2
  • విజయం ట్రంప్ కు ఖాయమని అంచనా
Numaralogists predict win is with trump

లైఫ్ పాత్ సంఖ్య, మాస్టర్ ఇయర్ ఆధారంగా మరోమారు అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విజయం ఖాయమేనని జ్యోతిష్యులు, సంఖ్యా శాస్త్ర నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ విషయాన్ని పేర్కొన్న 'యాహూ న్యూస్' ట్రంప్ విజయం ఖాయమని చాలా మంది న్యూమరాలజిస్టులు జోస్యం చెబుతున్నారని వెల్లడించింది. కాగా, ఓ వ్యక్తి జన్మ తేదీలోని అంకెలను ఓ పద్ధతి ప్రకారం కూడి లైఫ్ పాత్ నంబర్ ను నిర్ణయిస్తారు. దీన్నే డెస్టినీ నంబర్ అని కూడా అంటారు.

ట్రంప్ 1946, జూన్ 14న జన్మించారు. ప్రత్యేక పద్ధతిలో కూడితే లైఫ్ పాత్ నంబర్ 22 అవుతుంది. ఈ సంఖ్య ఉన్న వారివి భారీ ప్రణాళికలని, భారీ విజయాలు సాధిస్తుంటారని చెబుతున్న న్యూమరాలజిస్టులు, బైడెన్ పుట్టిన రోజు 1942, నవంబర్ 20ని కూడితే 2 లైఫ్ పాత్ నంబర్ అవుతుందని, ఇది చాలా తక్కువ శక్తితో ఉన్న అంకె అని, వీరు ఎంతగా కృషి చేసినా గుర్తింపు లభించదని విశ్లేషించారు. ఇక ఎన్నికలు జరిగే 2020 ట్రంప్ కు మాస్టర్ ఇయర్ అని, అందువల్లే విజయం ఖాయమని అంటున్నారు.