తెలంగాణ సీఎం సహాయనిధికి రూ.50 వేలు విరాళం ఇచ్చిన సంపూర్ణేశ్ బాబు

21-10-2020 Wed 21:49
  • తెలంగాణలో వరద బీభత్సం
  • హైదరాబాద్ సహా పలు ప్రాంతాల్లో జలప్రళయం
  • మంత్రి హరీశ్ రావుకు చెక్ అందించిన సంపూ
Sampoornesh Babu donates fifty thousand rupees for Telangana flood relief

ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు, ఏదైనా సామాజిక అవసరం వచ్చినప్పుడు ముందు నిలిచే వ్యక్తి హీరో సంపూర్ణేశ్ బాబు. టాలీవుడ్ లో సంపూ చిన్న హీరోనే అయినా, అతని మనసు చాలా పెద్దదని అనేక పర్యాయాలు రుజువైంది. నాడు కేరళ వరదల నుంచి ఇవాళ్టి హైదరాబాద్ వరదల వరకు ప్రతి విపత్తుకు తన వంతు సాయం ప్రకటిస్తూ సిసలైన మానవతకు నిదర్శనంలా నిలుస్తున్నాడు.

తాజాగా, సంపూర్ణేశ్ బాబు మంత్రి హరీశ్ రావుకు రూ.50 వేలు చెక్ రూపంలో అందించారు. రాష్ట్రంలో వరద ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యల కోసం సీఎం రిలీఫ్ ఫండ్ కు ఆ విరాళం ఇస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా సంపూర్ణేశ్ బాబును మంత్రి హరీశ్ రావు మనస్ఫూర్తిగా అభినందించారు.