ఏపీ కరోనా అప్ డేట్: 3,746 పాజిటివ్ కేసులు, 27 మరణాలు

21-10-2020 Wed 18:09
  • గత 24 గంటల్లో 74,422 కరోనా టెస్టులు
  • తాజాగా 4,739 మందికి కరోనా నయం
  • ఇంకా 32,376 మందికి చికిత్స
Corona bulletin of Andhra Pradesh

ఏపీలో కరోనా వ్యాప్తి వివరాలపై వైద్య ఆరోగ్య శాఖ తాజా బులెటిన్ విడుదల చేసింది. గడచిన 24 గంటల్లో 74,422 కరోనా టెస్టులు నిర్వహించగా 3,746 మందికి పాజిటివ్ అని తేలింది. అత్యధికంగా తూర్పు గోదావరి జిల్లాలో 677 కొత్త కేసులు రాగా, అత్యల్పంగా కర్నూలు జిల్లాలో 65 మందికి వైరస్ సోకినట్టు గుర్తించారు. అదే సమయంలో రాష్ట్రవ్యాప్తంగా 27 మరణాలు సంభవించాయి. దాంతో మొత్తం కరోనా మృతుల సంఖ్య 6,508కి పెరిగింది. తాజాగా, 4,739 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

రాష్ట్రంలో ఇప్పటివరకు మొత్తం 7,93,299 పాజిటివ్ కేసులు నమోదు కాగా, 7,54,415 మంది కరోనా మహమ్మారి నుంచి విముక్తులయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 32,376 యాక్టివ్ కేసులు మాత్రమే ఉన్నాయి.