సీఎం జగన్ పై కేసుల విచారణ ఈ నెల 27కి వాయిదా

21-10-2020 Wed 15:04
  • సెలవులో ఉన్న సీబీఐ కోర్టు న్యాయమూర్తి
  • కోర్టుకు దసరా సెలవులు
  • వాయిదా నిర్ణయం వెలువరించిన ఇన్చార్జి న్యాయమూర్తి
Court adjourns hearing on Jagan cases

సీఎం జగన్ ఆస్తుల వ్యవహారంపై నాంపల్లి సీబీఐ కోర్టులో విచారణ వాయిదా పడింది. పండుగల నేపథ్యంలో న్యాయస్థానాలకు సెలవులు రావడంతో జగన్ ఆస్తులపై విచారణను ఈ నెల 27కి వాయిదా వేశారు. సీబీఐ స్పెషల్ కోర్టు న్యాయమూర్తి వీఆర్ మధుసూదన్ రావు సెలవులో ఉన్నారు. దానికితోడు దసరా సెలవులు రావడంతో విచారణను వాయిదా వేస్తునట్టు నాంపల్లి సీబీఐ కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి వెల్లడించారు.

అటు, మెట్రోపాలిటన్ సెషన్స్ జడ్జి పరిధిలో ఉన్న ఈడీ కేసుపై విచారణ నవంబరు 9వ తేదీకి వాయిదా పడింది. కాగా, సీఎం జగన్ కేసులను విచారిస్తున్న సీబీఐ ప్రత్యేక కోర్టుకే ఈడీ కేసును కూడా బదలాయించాలంటూ హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా, ఆ పిటిషన్ పై విచారణ నవంబరు 5కి వాయిదా పడింది.