పోలీసు అమరవీరులకు సీఎం కేసీఆర్ ఘననివాళి

21-10-2020 Wed 14:26
  • నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినం
  • పోలీసుల త్యాగాలను ప్రజలు ఎన్నటికీ మర్చిపోరన్న కేసీఆర్
  • అమరవీరుల కుటుంబాలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తామని వెల్లడి
CM KCR pays rich tributes to police martyrs

సామాజిక భద్రతకు మూలస్తంభాలైన పోలీసులను స్మరించుకుంటూ సీఎం కేసీఆర్ పోలీసు అమరవీరులకు ఘన నివాళి అర్పించారు. నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినత్సోవం. ఈ సందర్భంగా ఆయన విధి నిర్వహణలో కన్నుమూసిన పోలీసుల సేవలను వేనోళ్ల కీర్తించారు. ప్రజల ప్రాణాలను, ప్రజల ఆస్తులను కాపాడడంతో పోలీసుల అసమాన త్యాగాలను దేశ ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని తెలిపారు.

ప్రజల కోసం తమ ప్రాణాలను సైతం త్యజించి ధీరోదాత్తులుగా నిలిచిపోయిన అమరవీరుల కోసం పోలీసు శాఖ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు. అమరవీరుల కుటుంబాల సంక్షేమానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని సీఎం కేసీఆర్ ఉద్ఘాటించారు. ఈ సందర్భంగా తెలంగాణ సీఎంవో ట్విట్టర్ లో వెల్లడించింది.