నిధులు ఇవ్వడం లేదంటూ.. హైకోర్టులో పిటిషన్ వేసిన ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్

21-10-2020 Wed 14:14
  • ఈసీ నిర్వహణకు ప్రభుత్వం నిధులను మంజూరు చేయడం లేదు
  • రాజ్యాంగం ప్రకారం ఇది చట్ట విరుద్ధం
  • ఎన్నికల నిర్వహణకు కూడా సహకరించడం లేదు
SEC Nimmagadda Ramesh files petition in AP HC

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్ నిర్వహణకు ఖర్చయ్యే నిధులను ఏపీ ప్రభుత్వం మంజూరు చేయడం లేదని పిటిషన్ వేశారు. ఎన్నికల నిర్వహణకు కూడా ప్రభుత్వం సహకరించడం లేదని తెలిపారు.

 ఈ అంశంలో హైకోర్టు జోక్యం చేసుకోవాలని, నిధులు విడుదలయ్యేలా ఆదేశాలు జారీ చేయాలని విన్నవించారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 243 (కే) ప్రకారం ఎన్నికల కమిషన్ కు నిధులను ఆపేయడం చట్ట విరుద్ధమని చెప్పారు. ఈ పిటిషన్ లో ప్రతివాదులుగా ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ సెక్రటరీలను చేర్చారు.