రాహుల్ గాంధీ ఓ కోటరీని ఏర్పరుచుకున్నారు: ఖుష్బూ

21-10-2020 Wed 13:58
  • కాంగ్రెస్ లో అసంతృప్తి పెరిగిపోతోంది
  • రాహుల్ చుట్టూ ఉన్నవాళ్లు పారదర్శకంగా ఉన్నారు
  • బీజేపీలో చేరాలని నాకు ఎప్పుడో ఆఫర్లు వచ్చాయి
There is a Coterie around Rahul Gandhi says Khushboo

కాంగ్రెస్ పార్టీలో అసంతృప్తి పెరిగిపోతోందని... ఈ విషయాన్ని రాహుల్ గాంధీ గుర్తించాలని ఇటీవలే ఆ పార్టీని వీడి బీజేపీలో చేరిన సినీ నటి ఖుష్బూ అన్నారు. రాహుల్ చుట్టూ ఒక కోటరీని ఏర్పరుచుకున్నారని... కొత్తగా వచ్చే వారిని అందులోకి అనుమతించరని చెప్పారు. ఆయన చుట్టూ ఉన్నవాళ్లు పారదర్శకంగా ఉండరని అన్నారు. కాంగ్రెస్ లో తనను అణచి వేయడానికి ఎందరో ప్రయత్నించారని చెప్పారు. బీజేపీలో చేరాలని తనకు చాలా కాలం క్రితమే ఆఫర్లు వచ్చాయని తెలిపారు. అయితే పార్టీ మారలేనని అప్పట్లో బీజేపీ నేతలకు చెప్పానని... చివరకు పునరాలోచించుకుని బీజేపీలో చేరానని చెప్పారు.

కాంగ్రెస్ లో తనకు జరిగిన అవమానాలను రాహుల్ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకపోయిందని ఖుష్బూ అన్నారు. అయితే తనను అణచి వేయాలనుకున్న వారి పేర్లను మాత్రం బహిరంగంగా వెళ్లడించనని... సోనియాగాంధీకి రాసిన లేఖలో అన్ని వివరాలను వెల్లడించానని చెప్పారు.