‘ఆర్ఆర్ఆర్’ నుంచి జూ.ఎన్టీఆర్ టీజర్ క్లిప్‌ను పోస్ట్ చేసిన రామ్ చరణ్.. చెర్రీకి తారక్ కౌంటర్!

21-10-2020 Wed 12:58
  • నీళ్లలోంచి కొమురం భీమ్ ఆయుధం తీస్తున్న క్లిప్ పోస్ట్
  • ఎన్టీఆర్, చెర్రీల మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర చర్చ
  • ఎన్టీఆర్‌లా కాకుండా సరైన సమయానికి  టీజర్ విడుదల చేస్తానన్న చెర్రీ
  • ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యమైందన్న తారక్
  • జక్కన్నతో వ్యవహారం అంతతేలిక కాదని కౌంటర్
Brother  heres something to tease you

బాహుబలి' సినిమా తర్వాత దర్శకుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాలోంచి హీరో రామ్ చరణ్ ఈ రోజు జూనియర్ ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన వీడియో టీజర్ ను పోస్ట్ చేశాడు. ఇప్పటికే  ఈ సినిమా నుంచి ‘భీమ్‌ ఫర్‌ రామరాజు’ పేరిట చెర్రీ టీజర్ విడుదలైన విషయం తెలిసిందే.

అల్లూరి సీతారామరాజు పాత్రలో రామ్ చరణ్‌ను ఈ సినిమా యూనిట్ ప్రేక్షకులకు పరిచయం చేసింది. కొమరం భీమ్‌గా నటిస్తోన్న ఎన్టీఆర్‌కు సంబంధించిన టీజర్ ను ఈ నెల 22న విడుదల చేయనున్నారు. ఈ నేపథ్యంలో దానిలోని క్లిప్‌ను విడుదల చేశారు.

నీళ్లలోంచి కొమురం భీమ్ ఆయుధం తీస్తుండడం ఇందులో చూడొచ్చు. దీనిపై ఎన్టీఆర్, చెర్రీల మధ్య ట్విట్టర్ లో ఆసక్తికర  చర్చ జరిగింది. ‘బ్రదర్ తారక్ నీకోసం ఒకటి విడుదల చేస్తున్నాను.  కానీ, నీలా కాకుండా సరైన సమయానికి నీ టీజర్ ను విడుదల చేస్తాను’ అని చెర్రీ అన్నాడు. నవ్వుతూ ఉన్న ఎమోజీలను పోస్ట్ చేశాడు.

దీనికి తారక్ కౌంటర్ ఇచ్చాడు. ‘బ్రో... నువ్వు ఓ విషయాన్ని గుర్తిస్తావని ఆశిస్తున్నాను.. నువ్వు ఆల్రెడీ ఐదు నెలలు ఆలస్యం చేశావు.. ఇప్పుడు కూడా నువ్వు జాగ్రత్తగానే ఉండాలి.. ఎందుకంటే జక్కన్నతో వ్యవహారం.. ఏదైనా జరగొచ్చు’ అని చెప్పాడు.