‘నర్తనశాల’లో భీముడి లుక్ విడుదల.. స్పందించిన శ్రీహరి కుమారుడు

21-10-2020 Wed 12:45
  • బాలకృష్ణ ‘నర్తనశాల’లో భీముడిగా నటించిన శ్రీహరి
  • చాలా రోజుల తర్వాత స్క్రీన్ మీద చూడబోతున్నామన్న కుమారుడు
  • తమ కుటుంబం కూడా చాలా ఆత్రుతగా ఉందని వ్యాఖ్య
SriHaris look as Bheema in Narthanasala

బాలకృష్ణ ‘నర్తనశాల’లో భీముడిగా నటించిన శ్రీహరి లుక్‌ను ఆ సినిమా యూనిట్ విడుదల చేసింది. ఈ లుక్ అందరినీ అలరిస్తోంది. ఈ లుక్ విడుదల కాకముందు శ్రీహరి కుమారుడు మేఘాంశ్ స్పందిస్తూ ఓ వీడియో పోస్ట్ చేశాడు. ‘అందరికీ ధన్యవాదములు.. చాలా రోజుల తర్వాత నాన్నగారిని మళ్లీ కొత్త సినిమాలో స్క్రీన్ మీద చూడబోతున్నాం.

నాన్నగారి అభిమానులతో పాటు మా కుటుంబం కూడా చాలా ఆత్రుతగా ఉంది’ అని చెప్పాడు. కాగా, నర్తనశాల షూటింగ్ 2004 మార్చి 1న ప్రారంభమైంది. అయితే, ఈ సినిమాలో ద్రౌపది పాత్రధారి సౌందర్య అకాల మరణంలో బాలయ్య ఈ సినిమాను ఆపేశారు. కొన్నాళ్ల క్రితం శ్రీహరి కూడా మరణించారు. విజయదశమి కానుకగా ఈ నెల 24న దీన్ని విడుదల చేయనున్నారు.