మీరు జెనీలియా భర్త కదా? అని అడిగాడు.. నా ఇగో హర్ట్ అయింది: రితేశ్ దేశ్‌ముఖ్

21-10-2020 Wed 12:21
  • ‘ది కపిల్‌ శర్మ కామెడీ షో’లో పాల్గొన్న దంపతులు
  • బెంగళూరులో ఒకసారి క్రికెట్‌ లీగ్‌ చూడటానికి వెళ్లానన్న రితేశ్
  • కర్ణాటక, ఏపీలో తనను జెనీలియా భర్త అంటారని వాపోయిన వైనం
  • మహారాష్ట్రలో మాత్రం ఆమెను రితేశ్‌ భార్య అంటారని వ్యాఖ్య
rithesh about genelia

ఓ విషయంలో తన ఇగో హర్ట్ అయిందని హీరోయిన్ జెనీలియా భర్త రితేష్‌ దేశ్‌ముఖ్‌ చెప్పుకొచ్చాడు. తాజాగా, ఆ దంపతులు ‘ది కపిల్‌ శర్మ కామెడీ షో’లో పాల్గొని పలు విషయాలు ముచ్చటించారు. ఇందుకు సంబంధించిన ప్రోమోను తాజాగా విడుదల చేశారు.

ఇందులో రితేశ్ దేశ్‌ముఖ్‌ మాట్లాడుతూ... బెంగళూరులో ఒకసారి క్రికెట్‌ లీగ్‌ చూడటానికి తాను వెళ్లానని చెప్పాడు. అక్కడ ఇద్దరు క్రికెటర్లు తమ గురించి మాట్లాడుకున్నారని, చివరకు తనతో మాట్లాడి ‘మీరు జెనీలియా భర్త కదా?’ అని అడిగారని చెప్పాడు. తనను జెనీలియా భర్త అనడంతో తన ఇగో కాస్త హర్ట్ అయ్యిందని రితేష్‌ తెలిపాడు. ఇక్కడ తాను జెనీలియా భర్తను అయినప్పటికీ, మహారాష్ట్రలో మాత్రం ఆమెను రితేశ్‌ భార్య అంటారని వ్యాఖ్యానించాడు. కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో తనను జెనీలియా భర్త అనే అంటారని చెప్పాడు.