రాధేశ్యామ్ నుంచి సర్‌ప్రైజ్ వచ్చేసింది.. విక్రమాదిత్యగా ప్రభాస్ లుక్ అదుర్స్‌!

21-10-2020 Wed 11:44
  • కారు ముందు భాగంపై కూర్చొన్న ప్రభాస్
  • కిందికి చూస్తూ చిరునవ్వులు
  • ఈ నెల 23న ప్రభాస్ జన్మదినం సందర్భంగా మోషన్‌ పోస్టర్
introducing Prabhas as Vikramaditya in the latest poster of RadheShyam

యంగ్ రెబల్ స్టార్ ప్ర‌భాస్ ‘సాహో’ సినిమా తర్వాత నటిస్తోన్న ‘రాధే శ్యామ్‌’ సినిమా నుంచి సర్‌ప్రైజ్ వచ్చింది. ఈ సినిమాలో ప్రభాస్ విక్రమాదిత్య పాత్రలో నటిస్తున్నాడని తెలుపుతూ ఆ సినిమా యూనిట్ ఆయనకు సంబంధించిన పోస్టర్‌ను విడుదల చేసింది. కారు ముందు భాగంపై కూర్చొని కిందికి చూస్తూ ప్రభాస్ చిరునవ్వులు చిందిస్తూ కనపడుతున్నాడు.

ఆయన లుక్‌ పట్ల అభిమానులు అమితాసక్తి వ్యక్తం చేస్తూ కామెంట్లు చేస్తున్నారు. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలోంచి ఇటీవల పూజ హెగ్డే స్టిల్ ను విడుదల చేసిన విషయం తెలిసిందే.  ఈ సినిమా పీరియాడిక్ లవ్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకుంటోంది.

భాగ్యశ్రీ, సచిన్ కేడ్కర్, ప్రియదర్శి ఈ సినిమాలో కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో యూవీ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమా నుంచి ఈ నెల 23న ప్రభాస్ జన్మదివం సందర్భంగా మోషన్‌ పోస్టర్‌ను విడుదల చేయబోతున్నట్లు ఈ సినిమా యూనిట్ తెలిపింది.