LG: 65 అంగుళాల ఎల్జీ మడత పెట్టే టీవీ మార్కెట్లోకి... ఎలానో చూపే వీడియో ఇదిగో!

  • దక్షిణ కొరియాలో అందుబాటులోకి
  • ధర 87 వేల డాలర్లు
  • పూర్తిగా ముడుచుకుని పోయే ఓఎల్ఈడీ
LG Release OLED Rolable Smart TV

2018లో ఎల్జీ సంస్థ ఆవిష్కరించిన 65 అంగుళాల ఓఎల్ఈడీ విప్లవాత్మక టీవీని దక్షిణ కొరియాలో ఇప్పుడు మార్కెట్లోకి విడుదల చేశారు. సౌత్ కొరియాలోని చాలా నగరాల్లో ఉన్న రిటైల్ స్టోర్లలో దీన్ని అందుబాటులో ఉంచామని సంస్థ పేర్కొంది. ఈ రోలబుల్ ఓఎల్ఈడీ టీవీ ధర 87 వేల డాలర్లు (సుమారు 67 లక్షలు)గా సంస్థ నిర్ణయించింది.

కాగా, దీని ప్రత్యేకతలను పరిశీలిస్తే, కింద ఉండే అల్యూమినియం బేస్ లో ఇది పూర్తిగా ముడుచుకుని పోతుంది. దీని స్క్రీన్ ఫుల్ సైజ్ 65 అంగుళాలు కాగా, కస్టమర్లు తమకు నచ్చిన సైజ్ లో చూసుకునేలా మార్చుకునే వీలుంటుంది. 100 వాట్స్ ఔట్ పుట్ పవర్ తో 3.2 చానెల్ :ఔట్ పుట్ సరౌండ్ సౌండ్ అనుభూతిని ఇది కల్పిస్తుంది. బ్లూ టూత్ స్పీకర్ సదుపాయంతో పాటు, మ్యూజిక్, క్లాక్, ఫ్రేమ్, మూడ్, హోమ్ డ్యాష్ బోర్డ్ పేరిట ఐదు రకాల లైన్ మోడ్స్ అందుబాటులో ఉంటాయి.

జియోన్ బుక్ నగరంలోని గుమీ టీవీ ప్లాంట్ లో దీన్ని తయారు చేస్తున్నామని, ఈ లగ్జరీ గృహోపకరణంలో కొంత పనిని మెషీన్ల ద్వారా కాకుండా, నిపుణులైన కార్మికులు చేతితో పని చేస్తున్నారని సంస్థ పేర్కొంది. ఈ స్మార్ట్ టీవీకి వాడిన ఫ్యాబ్రిక్ కవర్ ను డానిష్ టెక్స్ టైల్ సంస్థ క్వాడ్రాట్ తయారు చేయడం గమనార్హం. ఈ టీవీతో 3 సంవత్సరాల వారంటీ కూడా లభిస్తుందని సంస్థ పేర్కొంది. అయితే, ప్రస్తుతానికి ఈ స్మార్ట్ టీవీ భారత్ లో అందుబాటులోకి రాలేదు


More Telugu News