Hamsa Priya: హంసప్రియకు 'శ్రీమతి తెలంగాణ' కిరీటం!

Hamsa Priya Wins Mrs Telangana Competition
  • వర్య్చువల్ విధానంలో పోటీలు
  • కేవలం అందం మాత్రమే ప్రామాణికం కాదు
  • వెల్లడించిన మమతా త్రివేది
మిస్సెస్ తెలంగాణ కిరీటం, హైదరాబాద్ కు చెందిన శ్రీమతి హంసప్రియకు దక్కింది. ఈ టైటిల్ కోసం ఎంతో మంది మహిళలు పోటీ పడగా, నగరానికి చెందిన హంస, టైటిల్ ను గెలుచుకున్నారని నిర్వాహకులు ప్రకటించారు. ఈ పోటీల్లో ఎంతో మంది వివాహమైన మహిళలు, ఆన్ లైన్ విధానంలో పాల్గొన్నారని వెల్లడించిన నిర్వాహకురాలు మమతా త్రివేది, కేవలం అందం మాత్రమే కాకుండా ప్రతిభ ఆధారంగా విజేతను నిర్ణయించామని స్పష్టం చేశారు.ఆడిషన్స్ నుంచి గ్రూమింగ్ వరకూ వర్చ్యువల్ విధానంలో పోటీలు సాగాయని, పోటీదారుల్లోని ప్రతిభ, తెలివితేటలు, సామాజిక నిబద్ధత తదితరాలను ప్రమాణాలుగా చేసుకుని విజేతగా హంసప్రియను ఎంపిక చేసినట్టు తెలిపారు.
Hamsa Priya
Mrs Telangana
Mamata Trivedi

More Telugu News