India: చైనా సైనికుడిని అప్పగించిన భారత్

  • జడల బర్రెను వెతుకుతూ భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడు
  • తమకు అప్పగించాలంటూ చైనా విజ్ఞప్తి
  • ప్రొటోకాల్ ప్రకారం అప్పగించిన భారత్
India hands over soldier who crossed border

భారత భూభాగంలోకి ప్రవేశించిన చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం ఈ ఉదయం తిరిగి చైనాకు అప్పగించినట్టు విదేశాంగ శాఖ తెలిపింది. చుషూల్-మోల్దో మీటింగ్ పాయింట్ వద్ద ప్రొటోకాల్ ప్రకారం చైనా సైనికుడిని అప్పగించినట్టు తెలిపింది.  

తప్పిపోయిన జడల బర్రెను వెతికిపెట్టాలన్న స్థానికుడి విజ్ఞప్తి మేరకు దానిని వెతుకుతూ అతడు పొరపాటున భారత భూభాగంలోకి ప్రవేశించినట్టు తెలుస్తోంది. అతడిని తిరిగి తమకు అప్పగించాలంటూ నిన్న చైనా విజ్ఞప్తి చేసింది. చైనా సైనికుడిని అదుపులోకి తీసుకున్న భారత సైన్యం వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం ప్రొటోకాల్ ప్రకారం అప్పగిస్తామని తెలిపింది. అందులో భాగంగా ఈ ఉదయం అప్పగించింది.

More Telugu News