Rashikhanna: సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం 

Rashi Khanna in a deglamourized role
  • డీ గ్లామరైజ్డ్ పాత్రలో రాశిఖన్నా
  • నితిన్ కూడా ఇటలీకి పయనం
  • 'అర్జున్ రెడ్డి' దర్శకుడి కీలక నిర్ణయం  
*  కథానాయిక రాశిఖన్నా డీ గ్లామరైజ్డ్ పాత్రలో నటిస్తోంది. విజయ్ సేతుపతి హీరోగా తమిళ, తెలుగు భాషాల్లో రూపొందుతున్న 'తుగ్లక్ దర్బార్' చిత్రంలో ఈ చిన్నది ఇలా డీ గ్లామరైజ్డ్ పాత్రను పోషిస్తోంది.
*  ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 'రాధే శ్యామ్' చిత్రం షూటింగ్ ఇటలీలో జరుగుతోంది. ఇదే క్రమంలో హీరో నితిన్ నటిస్తున్న 'రంగ్ దే' చిత్రానికి సంబంధించిన రెండు పాటల చిత్రీకరణ కూడా ఈ నెల 25 నుంచి ఇటలీలో నిర్వహిస్తారు.
*  'అర్జున్ రెడ్డి' చిత్రంతో ఒక్కసారిగా తెలుగు, హిందీ భాషల్లో పేరు తెచ్చుకున్న దర్శకుడు సందీప్ రెడ్డి వంగా తన కెరీర్ కి సంబంధించి కీలకమైన నిర్ణయాన్ని తీసుకున్నాడు. ఇకపై తాను దర్శకత్వం వహించే చిత్రాలకు తానే నిర్మాతగా ఉంటానని చెప్పాడు. ఇతర సంస్థలకు చిత్రాలు చేస్తే, క్రియేటివిటీ పరంగా స్వేచ్ఛ ఉండడం లేదని చెప్పాడు.  
Rashikhanna
Vijay Setupati
Prabhas
Nitin

More Telugu News